రైలు కింద పడి కానిస్టేబుల్ ఆత్మహత్య
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన కానిస్టేబుల్ అరవింద్ యాదవ్ (25) ఆదివారం వేకువజామున రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రామన్ కాలనీ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న మూడో రైల్వే లైన్‌పై చోటుచేసుకుంది.
అరవింద్ యాదవ్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న బెల్లంపల్లి రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment