దారుణ హత్య.. యువకుడిని నరికి చంపిన దుండగులు
Secunderabadలోని చిలకలగూడ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ఓ యువకుడిని ఆరుగురు దుండగులు అత్యంత కిరాతకంగా నరికి హతమార్చిన సంఘటన గురువారం రాత్రి కలకలం రేపింది.
స్థానికుల కథనం ప్రకారం.. బైక్‌లపై వచ్చిన దుండగులు యువకుడిని వెంటాడి పట్టుకుని కత్తులతో దాడి చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో చిలకలగూడ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
దుండగులు ఘటన అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, హత్యకు గల అసలు కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Post a Comment