-->

పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం

పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. Lions Club of Kothagudem Millennium ప్రెసిడెంట్ లయన్ బొక్క శ్రీనివాస్ కుమారుడు బొక్క పవన్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్నదానం చేపట్టారు.

కొత్తగూడెంలోని హెడ్ ఆఫీస్ ఎదురుగా ఉన్న శ్రీ జ్యోతి వృద్ధుల శరణాలయం లో వృద్ధులకు ప్రత్యేకంగా భోజనాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని వృద్ధులకు ఆహారం అందించి వారి ఆశీర్వాదాలు పొందారు.

ఈ కార్యక్రమంలో లయన్ బొక్క శ్రీనివాస్, ట్రెజరర్ లయన్ పగడాల నగేష్, జడ్‌సీ పల్లెపు వెంకన్న, లయన్ పితాని సత్యనారాయణ, లయన్ రాయల శాంతయ్య, లయన్ జేబీ మోహన్, లయన్ గోవర్ధన్, లయన్ శరత్ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఆశ్రమం నిర్వహకులు కూడా కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమాన్ని అభినందించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793