పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ శంకుస్థాపన
Bhatti Vikramarka మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాల అభివృద్ధి లక్ష్యంగా కోమట్లగూడెం–కొండవనమాల బీటీ, సీసీ రోడ్లు, అనంతసాగర్–రామకృష్ణాపురం–లచ్చేగూడం బీటీ రోడ్డు, అంతర్గత సీసీ రోడ్లు, అలాగే మత్కేపల్లి–తిరుమలాపురం బీటీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం ద్వారా ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా వ్యవస్థను అందించడం ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్ల అభివృద్ధితో గ్రామాల మధ్య అనుసంధానం మెరుగుపడి, ప్రజల దైనందిన ప్రయాణాలు సులభతరం అవుతాయని పేర్కొన్నారు.
స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Post a Comment