తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్‌సిగ్నల్..
Vijay నేతృత్వంలోని టీవీకే పార్టీకి తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ Rajendra Arlekar గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గవర్నర్‌తో విజయ్ దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయిన అనంతరం ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ 108 స్థానాలు గెలుచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. అనంతరం Indian National Congress, Viduthalai Chiruthaigal Katchi (వీసీకే) మద్దతు ప్రకటించడంతో టీవీకే బలం 114కి చేరింది.
ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరుతూ బుధవారం విజయ్ తన సహచరులు బుస్సీ ఆనంద్, అధవ్ అర్జున్, సెంగోట్టయ్యన్‌తో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీవీకే తరఫున గెలిచిన 107 మంది ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందజేశారు. విజయ్ రెండు స్థానాల్లో విజయం సాధించిన కారణంగా మొత్తం సంఖ్య 108గా నమోదైంది.
అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో మొదటి భేటీ అనంతరం విజయ్ వెనుదిరిగారు. తర్వాత కాంగ్రెస్, వీసీకే పార్టీలు మద్దతు ప్రకటించడంతో టీవీకే శాసనబలం మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో విజయ్ గురువారం మరోసారి గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలిశారు. తాజా సంఖ్యాబలం వివరాలను సమర్పించగా, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Post a Comment