-->

ఈ నెల 13 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఈ నెల 13 నుంచి ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు


హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను గురువారం విడుదల చేయనున్నారు. మొదటగా కాలేజీల లాగిన్‌లో అందుబాటులో ఉంచి, అనంతరం రెండు రోజులలో విద్యార్థుల వాట్సాప్ నంబర్లకు పంపించనున్నారు.

విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు. ఈ ఏడాది అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం మొత్తం 3,97,997 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించగా, ఒకేషనల్ విభాగంలో 28,703 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు.

పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇంటర్ బోర్డు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.

షెడ్యూల్ ప్రకారం మే 13 నుంచి మే 21 వరకు ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.

  • ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
  • సెకండ్ ఇయర్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరగనున్నాయి.
Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793