-->

శేఖర్ బంజరలో అర్బన్ హెల్త్ సెంటర్‌లో వాక్సిన్ రూమ్ ప్రారంభం

శేఖర్ బంజరలో అర్బన్ హెల్త్ సెంటర్‌లో వాక్సిన్ రూమ్ ప్రారంభం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం శేఖర్ బంజరలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో నూతనంగా నిర్మించిన వాక్సిన్ రూమ్‌ను నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ వాక్సిన్ రూమ్‌ను నవ లిమిటెడ్ సంస్థ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమాల భాగంగా నిర్మించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ రిబ్బన్ కట్ చేసి వాక్సిన్ రూమ్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి నవ లిమిటెడ్ చేస్తున్న సేవలను అభినందించారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో సెంట్రల్ ఆక్సిజన్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, అలాగే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం నిరీక్షణాలయం నిర్మించడం వంటి కార్యక్రమాలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణ కుమారి మాట్లాడుతూ, వాక్సినేషన్ సమయంలో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సంస్థ దృష్టికి తీసుకెళ్లగా, నవ లిమిటెడ్ తక్షణమే స్పందించి కేవలం మూడు నెలల్లోనే వాక్సిన్ రూమ్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చిందని తెలిపారు.

ఈ సందర్భంగా సంస్థ డిజిఎం సి.హెచ్. శ్రీకాంత్ మాట్లాడుతూ, సంస్థ చేపడుతున్న ఆరోగ్యం, విద్య, జీవనోపాధి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో CSR మేనేజర్ సి.హెచ్. శ్రీనివాసరావు, సివిల్ ఇంజనీర్ ఫణీంద్రచారి, కరుణాకర్, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు మరియు CSR సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793