కొత్తగూడెంలో జిల్లా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలు
సుజాతనగర్ : ఈ నెల 23, 24 తేదీల్లో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని హనుమాన్ బస్తీ బ్యాడ్మింటన్ క్లబ్‌లో జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ పోటీలకు హాజరుకావాలని కోరుతూ టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములను టోర్నీ నిర్వాహకులు సుజాతనగర్‌లోని ఆయన స్వగృహంలో కలిసి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా టోర్నీ నిర్వహణకు సంబంధించిన వివరాలను కమిటీ సభ్యులు నాగా సీతారాములకు వివరించారు. క్రీడల అభివృద్ధికి ఇలాంటి పోటీలు దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
ఈ ఆహ్వాన కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ట్రెజరర్ కె. రమేష్, ప్రోగ్రామ్ చైర్మన్ గోనేల నాని, కమిటీ సభ్యులు ఎన్. హరీష్, సయ్యద్ యాకుబ్, పి. ఉదయ్, పాండు నాయక్, టి. హసన్ కుమార్, ఎన్. వంశీ సాగర్, టి. రాజేష్, వి. అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment