జస్టిస్ గుండా చంద్రయ్య మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
హైదరాబాద్: తెలంగాణ మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్, ఉమ్మడి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ గుండా చంద్రయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
వివిధ ప్రభుత్వ శాఖలకు స్టాండింగ్ కౌన్సిల్‌గా, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యుడిగా, ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందిస్తూ న్యాయ రంగంలో జస్టిస్ చంద్రయ్య గారు విశేష కృషి చేశారని సీఎం పేర్కొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌కు చెందిన జస్టిస్ చంద్రయ్య గారు సామాజిక అసమానతలు, మానవ హక్కుల ఉల్లంఘనల వంటి కీలక అంశాలపై చారిత్రాత్మక తీర్పులు వెలువరించారని గుర్తుచేశారు.
వారి మరణం న్యాయ వ్యవస్థకు తీరని లోటని పేర్కొన్న ముఖ్యమంత్రి, జస్టిస్ చంద్రయ్య గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు.

Post a Comment