-->

టీవీ చూడొద్దని మందలించడంతో పురుగుల మందు తాగి విద్యార్థిని మృతి

టీవీ చూడొద్దని మందలించడంతో పురుగుల మందు తాగి విద్యార్థిని మృతి


జన్నారం: పరీక్షల సమయంలో టీవీ చూస్తుందని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామంలో చోటుచేసుకుంది.

జన్నారం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మోత్కూరి లక్ష్మీనారాయణగౌడ్, పద్మ దంపతుల చిన్న కుమార్తె మోత్కూరి అక్షయ(19) లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. ప్రస్తుతం వార్షిక పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 3న టీవీ చూడకుండా చదువుపై దృష్టి పెట్టాలని తల్లిదండ్రులు ఆమెను మందలించారు.

టీవీ ఆఫ్ చేసి వారు పనులకు వెళ్లిన తర్వాత, క్షణికావేశానికి గురైన అక్షయ ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జన్నారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో అనంతరం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793