బక్రీద్ సెలవు మార్పు.. ఏపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు
ఈద్ అల్-అధా (బక్రీద్) పండుగ తేదీ మార్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక సెలవును కూడా మార్చింది. తొలుత మే 27న ప్రకటించిన బక్రీద్ సెలవును ఇప్పుడు మే 28కి మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆధారంగా పండుగ తేదీలు నిర్ణయించబడతాయి. ఈసారి నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో జీ ఖాదా నెల 30 రోజులు పూర్తవుతుందని ముస్లిం మత పెద్దలు ప్రకటించారు. దీంతో జిల్ హిజ్జా తొలి రోజును మే 19గా నిర్ణయించారు. దాంతో బక్రీద్ పండుగ మే 28 గురువారం జరగనుంది.
ముస్లిం మతపెద్దల సూచనల మేరకు పండుగ రోజు అధికారిక సెలవు ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మే 27న సెలవు ప్రకటించడంతో ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపార వర్గాల్లో కొంత అయోమయం నెలకొంది. తాజా ఉత్తర్వులతో ఆ సందిగ్ధతకు తెరపడింది.
మతపెద్దలు కూడా నెలవంక ఆధారంగా నిర్ణయించిన తేదీ ప్రకారమే బక్రీద్ నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం అధికారిక సెలవును ఒక రోజు వాయిదా వేసి మే 28కి మార్చింది.

Post a Comment