-->

BRS మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!

 

BRS మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్!

గంగుల కమలాకర్ను పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో కరీంనగర్ జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బీజేపీ శ్రేణుల దాడికి నిరసనగా భారత్ రాష్ట్ర సమితి పార్టీ శనివారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది.

జిల్లా బంద్ నేపథ్యంలో గంగుల కమలాకర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇటీవల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై దాడి జరిగిన ఘటన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు బంద్‌కు పిలుపునిచ్చినట్లు సమాచారం.

వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాలని బీఆర్ఎస్ నేతలు పిలుపునివ్వగా, దీనికి ప్రతిగా భారతీయ జనతా పార్టీ నాయకులు వ్యాపారులు దుకాణాలు తెరిచి సాధారణంగా వ్యాపారం కొనసాగించాలని కోరారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కరీంనగర్ నగరంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలుగా పలువురు నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటూ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793