-->

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం

 

రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం

హైదరాబాద్, మే 09: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీజీ ఈఏపీ సెట్-2026 పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 6 సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా, ఈ ఏడాది మొత్తం 2,10,766 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఉదయం సెషన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్న సెషన్ పరీక్షలు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు.

అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం సెషన్‌కు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 7:30 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అలాగే మధ్యాహ్న సెషన్ అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 గంటల నుంచి అనుమతిస్తారు. ఉదయం 9 గంటల తర్వాత, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని ఈఏపీ సెట్ కన్వీనర్ డాక్టర్ కే. విజయ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

అభ్యర్థులు పాటించాల్సిన సూచనలు:

- బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ తప్పనిసరిగా తీసుకురావాలి

- హాల్ టికెట్, ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డు వెంట ఉండాలి

- కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం

- పరీక్ష పూర్తైన వెంటనే స్క్రీన్‌పై మార్కులు ప్రదర్శించబడతాయి

ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా నార్మలైజ్డ్ మార్కులు లెక్కించి ర్యాంకులను కేటాయించనున్నట్లు అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793