-->

రామడుగులో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం

రామడుగులో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు బి.ఎన్. రావు పౌండేషన్

రామడుగులో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభం పేద మహిళల ఆర్థిక స్వావలంబనకు బి.ఎన్. రావు పౌండేషన్

రామడుగు, జూన్ 6: పేద మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించి వారిని ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో డాక్టర్ బి.ఎన్. రావు పౌండేషన్ ఆధ్వర్యంలో రామడుగు మండల కేంద్రంలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు.

పౌండేషన్ వ్యవస్థాపకులు, చైర్మన్ డాక్టర్ బి.ఎన్. రావు ఈ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమని, ఈ ఉచిత శిక్షణ ద్వారా పేద మహిళలు ఉపాధి అవకాశాలు పొందడమే కాకుండా తమ వ్యక్తిగత, సామాజిక, ఆర్థిక అభివృద్ధిని కూడా సాధించగలరని పేర్కొన్నారు.

మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని, తమ ప్రతిభను చాటుకుంటూ కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధికి కూడా తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత మహిళలకు ఉపాధి కల్పించడంలో ఈ శిక్షణ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌ఏసీ ట్రైనింగ్ టీచర్ శ్రీమతి త్రీవేణి, అరేపల్లి వినోద్, మండల స్థాయి మాజీ సర్పంచ్ ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పౌరులు పాల్గొని శిక్షణ కేంద్రం ప్రారంభాన్ని అభినందించారు. పౌండేషన్ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పేద మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793