-->

డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో భారీ మోసం.. ముగ్గురు అరెస్ట్

 

డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో భారీ మోసం.. ముగ్గురు అరెస్ట్

డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో భారీ మోసం.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్‌లోని అల్వాల్ ప్రాంతంలో డబుల్ బెడ్రూం ఇండ్లు ఇప్పిస్తామని చెప్పి పేద ప్రజలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు అనుచరులమని చెప్పుకున్న కొందరు వ్యక్తులు దాదాపు 100 మంది పేదల నుంచి రూ.50 వేల నుంచి రూ.1 లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

బాధితుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అల్వాల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా తిమ్మిరి గోపీనాథ్ పుష్పలత (A2), తిమ్మిరి గోపీనాథ్ విశాల్ (A3), మహేందర్ సింగ్ (A6)లను అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి 79 నకిలీ డబుల్ బెడ్రూం ఇంటి కేటాయింపు పత్రాలతో పాటు మూడు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ పత్రాల ఆధారంగా పేదలను నమ్మించి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.

ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న జయరాజ్ గంగాధరన్ (A1), నిషా రాజ్ (A4), చింటూ రాజ్ (A5), అలాగే రాజ్ అండ్ కో. రబ్బర్ స్టాంప్స్ (A7) ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపులు పూర్తిగా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతాయని, ఎవరైనా డబ్బులు తీసుకుని ఇండ్లు ఇప్పిస్తామని చెబితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఈ మోసంలో ఇంకా మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793