వెనెజ్వెలాలో భారీ భూకంపాలు.. మృతులు 10 వేల నుంచి 1 లక్ష వరకు ఉండొచ్చని అంచనా
వెనెజ్వెలాలో భారీ భూకంపాలు.. భారీ ప్రాణనష్టం భయాలు
దక్షిణ అమెరికా దేశమైన వెనెజ్వెలాలో వరుసగా రెండు భారీ భూకంపాలు సంభవించాయి. రాజధాని Caracas సహా పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా భూగర్భ శాస్త్ర సంస్థ (USGS) ప్రకారం మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించగా, కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే 7.5 తీవ్రతతో మరో భారీ భూకంపం నమోదైంది.
భూకంపాల కారణంగా అనేక భవనాలు కూలిపోయాయి. ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్లను వదిలి వీధుల్లోకి పరుగులు తీశారు. అత్యవసర సహాయక చర్యలు కొనసాగుతుండగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.
USGS విడుదల చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. మరణాల సంఖ్య వేలల్లో ఉండొచ్చని, అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో 10 వేల నుంచి లక్ష వరకు కూడా చేరుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. అయితే ఇవి కేవలం ప్రాథమిక అంచనాలే కాగా, అధికారిక మరణాల సంఖ్య ఇంకా వెల్లడికాలేదు.
భూకంప కేంద్రం కారకస్‌కు పశ్చిమంగా ఉన్న మోరాన్ ప్రాంతం సమీపంలో నమోదైంది. ప్రకంపనలు దేశవ్యాప్తంగా తీవ్రంగా అనిపించగా, రవాణా, కమ్యూనికేషన్ సేవలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్, ఇంధన సరఫరాలను అధికారులు భద్రతా చర్యగా నిలిపివేశారు.
ప్రస్తుతం సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసే పనిలో నిమగ్నమయ్యాయి. భూకంపం వల్ల జరిగిన నష్టం, ప్రాణనష్టం వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు.
newsupta9.com

Post a Comment