-->

పోలీస్ సిబ్బందికి రెయిన్‌కోట్లు అందజేసిన సీపీ Amber Kishore Jha

పోలీస్ సిబ్బందికి రెయిన్‌కోట్లు అందజేసిన సీపీ Amber Kishore Jha

పోలీస్ సిబ్బందికి రెయిన్‌కోట్లు అందజేసిన సీపీ Amber Kishore Jha

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పోలీస్ కమిషనర్ Amber Kishore Jha తెలిపారు. వర్షాకాలంలో విధులు నిర్వహించే సిబ్బందికి ఉపయోగపడే రెయిన్‌కోట్లను కమిషనర్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, క్షేత్రస్థాయిలో ప్రజల భద్రత కోసం ఎండా, వానా తేడా లేకుండా రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీస్ సిబ్బంది సంక్షేమం తమకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితులు, వర్షపు వాతావరణంలో విధులు నిర్వర్తించే సమయంలో రెయిన్‌కోట్లు సిబ్బందికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అన్నారు.

పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. వర్షాకాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు పాటించడంతో పాటు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ K. Srinivas, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు Shekhar, Mallesham, Ramesh తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793