-->

నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి దుర్మరణం.. మనవరాలి మృతిని తట్టుకోలేక నాయనమ్మ మృతి

నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి దుర్మరణం.. మనవరాలి మృతిని తట్టుకోలేక నాయనమ్మ మృతి

నీటి సంపులో పడి రెండేళ్ల చిన్నారి దుర్మరణం.. మనవరాలి మృతిని తట్టుకోలేక నాయనమ్మ మృతి 

జనగామ, జూన్ 25: జనగామ పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి చెందడంతో అంబేద్కర్‌నగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

స్థానికంగా నివాసం ఉంటున్న గూడెల్లి రఘువంశీ, పావని దంపతుల రెండేళ్ల కుమార్తె ప్రియాన్సి ఇంటి ఆవరణలో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు తెరిచి ఉన్న నీటి సంపులో పడిపోయింది. కొంతసేపటి తర్వాత చిన్నారి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పరిసర ప్రాంతాల్లో వెతికారు. అనంతరం నీటి సంపులో చూడగా చిన్నారి అచేతన స్థితిలో కనిపించింది.

వెంటనే చిన్నారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం జనగామ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఇదిలా ఉండగా, ఎంతో ప్రేమగా చూసుకునే మనవరాలు ప్రియాన్సి మృతదేహాన్ని చూసిన నాయనమ్మ నాగమ్మ (65) తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మనవరాలి మృతిని తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపించిన ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు స్పందించినప్పటికీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిసింది.

ఒకే రోజులో చిన్నారి ప్రియాన్సి, ఆమె నాయనమ్మ నాగమ్మ మృతి చెందడంతో గూడెల్లి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి జనగామ టౌన్ ఎస్సై సతీష్ వివరాలు సేకరిస్తూ విచారణ చేపట్టారు. నీటి సంపు భద్రతా లోపమే ఈ ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793