-->

చిన్న చిన్న మనస్పర్ధలకు చెక్.. కౌన్సిలింగ్‌తో ఒక్కటైన దంపతులు

జిల్లా దిశ చైర్‌పర్సన్, జిల్లా పారా లీగల్ వాలంటీర్ వాసర్ల నాగమణి చొరవతో కుటుంబంలో మళ్లీ ఆనందం

చిన్న చిన్న మనస్పర్ధలకు చెక్.. కౌన్సిలింగ్‌తో ఒక్కటైన దంపతులు

జిల్లా దిశ ఉమేన్స చైర్‌పర్సన్, జిల్లా పారా లీగల్ వాలంటీర్ వాసర్ల నాగమణి చొరవతో కుటుంబంలో మళ్లీ ఆనందం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూన్ 26: చిన్న చిన్న మనస్పర్ధలు, అపార్థాల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్న ఓ దంపతులను కౌన్సిలింగ్ ద్వారా మళ్లీ కలిపి కుటుంబ బంధాన్ని నిలబెట్టిన ఘటన అందరికీ ఆదర్శంగా నిలిచింది. కుటుంబంలో నెలకొన్న విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలకు పలుమార్లు కౌన్సిలింగ్ నిర్వహించి, ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునేలా అవగాహన కల్పించారు.

ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో జిల్లా దిశ ఉమేన్స చైర్‌పర్సన్ మరియు జిల్లా పారా లీగల్ వాలంటీర్ వాసర్ల నాగమణి కీలక పాత్ర పోషించారు. దంపతుల మధ్య ఉన్న సమస్యలను ఓర్పుతో విని, చిన్న చిన్న విభేదాల కోసం జీవితాంతం విడిపోవడం సరైన నిర్ణయం కాదని వివరించారు. ముఖ్యంగా, వారికి ఇద్దరు చిన్నారులు ఉన్నందున వారి భవిష్యత్తు, మానసిక స్థితి, కుటుంబ వాతావరణం ఎంత ముఖ్యమో అవగాహన కల్పించారు.

కౌన్సిలింగ్ అనంతరం దంపతులు తమ విభేదాలను పక్కనపెట్టి మళ్లీ కలిసి జీవించేందుకు అంగీకరించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో పరస్పరం సహకరించుకుంటూ ఆనందంగా జీవించాలని నిర్ణయించుకున్నారు.

ఈ సందర్భంగా వాసర్ల నాగమణి మాట్లాడుతూ, చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతి కుటుంబంలో సహజమేనని, వాటిని పెద్ద సమస్యలుగా మార్చకుండా పరస్పర సంభాషణ, సహనం, అవగాహనతో పరిష్కరించుకోవాలని సూచించారు. పిల్లల భవిష్యత్తు దృష్ట్యా దంపతులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఏవైనా కుటుంబ సమస్యలు ఎదురైనా చట్టపరమైన సహాయం, కౌన్సిలింగ్ సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు.

ఈ ఘటనతో మరో కుటుంబం విడిపోకుండా నిలబడి, ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను తిరిగి అందించినందుకు స్థానికులు జిల్లా దిశ ఉమేన్స చైర్‌పర్సన్, జిల్లా పారా లీగల్ వాలంటీర్ వాసర్ల నాగమణి సేవలను అభినందించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793