-->

ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 10 వేలు జారిమాన

 

ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 10 వేలు జారిమాన

ఫోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష 10 వేలు జారిమాన 

కొత్తగూడెం, జూలై 13: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడికి కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.10,000 జరిమానా కూడా విధిస్తూ భద్రాద్రి కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా & సెషన్స్ కోర్టు న్యాయమూర్తి శ్రీమతి ఎస్. సరిత సోమవారం తీర్పు వెలువరించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 2025 జూన్ 10న పాల్వంచ మండలం రెడ్డిగూడెం శివారు ప్రభాత్ నగర్‌లో నివాసముంటున్న ఆరేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన ఎదునూరి వీరయ్య లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లి పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, అప్పటి ఎస్‌ఐ బి. సురేష్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

అనంతరం అప్పటి పాల్వంచ డీఎస్పీ సతీష్ కుమార్ కేసు దర్యాప్తు చేపట్టి, బాధితురాలు, సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసి, అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కోర్టు మొత్తం 13 మంది సాక్షులను పరీక్షించింది.

ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన అనంతరం నిందితుడిపై అభియోగాలు రుజువయ్యాయని కోర్టు నిర్ధారించింది. దీంతో ఎదునూరి వీరయ్యకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

ఈ కేసులో ప్రభుత్వ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి పి.వి.డి. లక్ష్మి వాదనలు వినిపించారు. కేసు విచారణలో కోర్టు నోడల్ ఆఫీసర్ డి. రాఘవయ్య, కోర్టు లైజాన్ ఆఫీసర్ ఎస్. వీరభద్రం, కోర్టు డ్యూటీ ఆఫీసర్ ఆర్. వేణు సమన్వయం చేసి కీలక పాత్ర పోషించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793