-->

కొత్తగూడెం 3, 5, 7 డివిజన్లలో SIR కార్యక్రమం.. పర్యటించిన నాగాసీతారాములు

కొత్తగూడెం 3, 5, 7 డివిజన్లలో SIR కార్యక్రమం.. పర్యటించిన నాగాసీతారాములు
కొత్తగూడెం 3, 5, 7 డివిజన్లలో SIR కార్యక్రమం.. పర్యటించిన నాగాసీతారాములు

కొత్తగూడెం, జూలై 17: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3, 5, 7 డివిజన్లలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, పాలేరు SIR కో-ఆర్డినేటర్ నాగాసీతారాములు, కొత్తగూడెం SIR కో-ఆర్డినేటర్ మసన్‌పల్లి లింగాజి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా డివిజన్లలో పర్యటించిన వారు బీఎల్ఏలు, బూత్ సూపర్‌వైజర్ల పనితీరును సమీక్షించారు. ఇంటింటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాలు పూర్తిచేసుకున్న యువతను గుర్తించి ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేయాలని, డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి పేర్లను ఫారం-7 ద్వారా తొలగించాలని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు.

ఓటరు జాబితాలో ఏ ఒక్క అర్హుడి పేరు కూడా మిస్ కాకుండా చూసే బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని నాగాసీతారాములు పేర్కొన్నారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, దానిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, 3వ డివిజన్ కార్పొరేటర్ హోలి శ్రీను, 5వ డివిజన్ కార్పొరేటర్ నూకల సరితా రంగారావు, 7వ డివిజన్ ఇంచార్జ్ సుజాత రాంబాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బొల్లం ఉదయ్ కుమార్ యాదవ్‌తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు, బీఎల్ఓలు, బీఎల్ఏలు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

"ఓటు మన హక్కు – దాన్ని కాపాడుకోవడం మన బాధ్యత" అంటూ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793