-->

తెలంగాణ హోంశాఖలో 7 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగులకు భారీ ఊరట

తెలంగాణ హోంశాఖలో 7 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగులకు భారీ ఊరట

తెలంగాణ హోంశాఖలో 7 వేల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నిరుద్యోగులకు భారీ ఊరట

హైదరాబాద్, జూలై 4: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్ర హోంశాఖ పరిధిలోని పోలీస్, జైళ్లు, అగ్నిమాపక శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) విభాగాల్లో ఖాళీగా ఉన్న దాదాపు 7 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఖాకీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది అభ్యర్థుల్లో కొత్త ఆశలు చిగురించాయి.

ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇప్పటికే 5 వేల పోలీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. మిగిలిన 2 వేల పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఈ పోస్టుల్లో ఎస్‌పీఎఫ్, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించిన ఖాళీలు ఉండనున్నట్లు సమాచారం.

ఇక ప్రభుత్వ ఉత్తర్వులు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన వెంటనే తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఒకటి లేదా రెండు రోజుల్లో అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో నియామక ప్రక్రియకు తెరలేవనుంది.

ఇటీవల హోంశాఖలో ఖాళీ పోస్టుల భర్తీ చేయాలని నిరుద్యోగులు పలుమార్లు ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి భారీ ఊరటనిచ్చే అంశంగా మారింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ శాఖలో విడుదల కానున్న నాలుగో భారీ నియామక నోటిఫికేషన్ ఇదే కావడం విశేషం. అంతకుముందు 2015 డిసెంబర్ 31న 9,281 పోస్టులకు, 2018లో 1,217 ఎస్సై పోస్టులు, 16,285 కానిస్టేబుల్ పోస్టులకు, 2022లో 554 ఎస్సై పోస్టులు, 15,644 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి.

ఇప్పుడు రాబోతున్న 7 వేల పోస్టుల నియామక నోటిఫికేషన్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది. ఖాకీ యూనిఫాం ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్న వేలాది మంది యువతకు ఇది ఒక సువర్ణావకాశంగా మారనుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, పరీక్షల షెడ్యూల్ తదితర పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికానున్నాయి

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793