-->

కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్ బి. శివరాం రెడ్డికి టీఆర్‌వీకేఎస్ ఘన సన్మానం

 

కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్ బి. శివరాం రెడ్డికి టీఆర్‌వీకేఎస్ ఘన సన్మానం

కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్ బి. శివరాం రెడ్డికి టీఆర్‌వీకేఎస్ ఘన సన్మానం

పాల్వంచ, జూలై 25: కేటీపీఎస్ 7వ దశ చీఫ్ ఇంజనీర్‌గా ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన బి. శివరాం రెడ్డిని టీఆర్‌వీకేఎస్ (TRVKS) జెన్కో నాయకులు ఘనంగా సన్మానించారు. జెన్కో కార్యదర్శి ముత్యాల రాంబాబు ఆధ్వర్యంలో చీఫ్ ఇంజనీర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ బి. శివరాం రెడ్డి విజయవంతమైన పదవీకాలం కొనసాగాలని, ఉద్యోగులు-యాజమాన్యం మధ్య సమన్వయంతో సంస్థ మరింత అభివృద్ధి చెందాలని టీఆర్‌వీకేఎస్ నాయకులు ఆకాంక్షించారు. అనంతరం ఆయనను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసిస్టెంట్ సెక్రటరీ బొల్లి వెంకటరమణ, జెన్కో అసిస్టెంట్ సెక్రటరీలు ఎం.డి. అమీన్, ఎస్.కె. మల్సూర్, కేటీపీఎస్ 7వ దశ రీజనల్ అధ్యక్షుడు ధర్మపురి నాగేశ్వరరావు, కోశాధికారి కాలువ రవికుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు నారం దాసు వెంకటేశ్వర్లు, ఎస్. సత్యం, ఉపాధ్యక్షులు పద్మాకర్ రాజు, మేరెడ్డి వేమారెడ్డి, మార్గం వెంకటేశ్వర్లు, దుంపటి శ్రీను, రీజనల్ నాయకులు అజీజ్, యాకయ్య, వెంకన్న, రాఘవ, భవాని రమేష్, అకౌంట్స్ నాయకులు డి. రవీందర్, వై.డి. వినయ్ రాజు, వి. శ్రీధర్, ఆర్టిజన్ నాయకుడు జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793