-->

ఆర్‌జీ-2 మాజీ జీఎం బండి వెంకటయ్యకు ఘన సన్మానం

 

ఆర్‌జీ-2 మాజీ జీఎం బండి వెంకటయ్యకు ఘన సన్మానం

ఆర్‌జీ-2 మాజీ జీఎం బండి వెంకటయ్యకు ఘన సన్మానం

గోదావరిఖని, జూలై 25: సింగరేణి సంస్థలో ఆర్‌జీ-2 జనరల్ మేనేజర్‌గా సేవలందించి ఇటీవల పదవీ విరమణ పొందిన బండి వెంకటయ్యను వి.కె.పీ–హెచ్‌ఎంఎస్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో వి.కె.పీ–హెచ్‌ఎంఎస్ నాయకులు మాట్లాడుతూ, బండి వెంకటయ్య ఉద్యోగ జీవితంలో కార్మిక సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ, సంస్థ అభివృద్ధి, సమర్థవంతమైన పరిపాలనకు విశేష కృషి చేశారని కొనియాడారు. తన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించి కార్మికులు, సహోద్యోగుల మన్ననలు పొందిన అధికారిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.

పదవీ విరమణ అనంతరం కూడా సమాజ సేవలో చురుకుగా పాల్గొని ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తూ ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అయాజుద్దీన్‌తో పాటు వి.కె.పీ–హెచ్‌ఎంఎస్ ప్రతినిధులు, నాయకులు పాల్గొని బండి వెంకటయ్యకు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన భవిష్యత్ జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793