-->

పారడైజ్ సర్కిల్ వద్ద డ్రగ్స్ డెలివరీ యత్నం భగ్నం.. ఇద్దరు అరెస్ట్

 

పారడైజ్ సర్కిల్ వద్ద డ్రగ్స్ డెలివరీ యత్నం భగ్నం.. ఇద్దరు అరెస్ట్

పారడైజ్ సర్కిల్ వద్ద డ్రగ్స్ డెలివరీ యత్నం భగ్నం.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్, జూలై 28: నగరంలో డ్రగ్స్ సరఫరాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్, ఈగిల్ ఫోర్స్ తెలంగాణ, రామ్‌గోపాల్‌పేట్ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పారడైజ్ సర్కిల్ సమీపంలో డ్రగ్స్ డెలివరీ యత్నాన్ని భగ్నం చేశారు.

కిమ్స్ సన్‌షైన్ ఆస్పత్రి సమీపంలోని పారడైజ్ సర్కిల్ వద్ద మెఫెడ్రోన్ (Mephedrone) డ్రగ్‌ను తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల వద్ద నుంచి 4 గ్రాముల మెఫెడ్రోన్, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్ విలువ సుమారు రూ.12 వేల వరకు ఉంటుందని అధికారులు వెల్లడించారు.

నగరంలో డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌ను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న ఇతర వ్యక్తుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793