తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత.. కేర్ ఆస్పత్రిలో చికిత్స
తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరికి అస్వస్థత.. కేర్ ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆయనను బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.
సమాచారం ప్రకారం, గత రెండు రోజులుగా మంత్రి జ్వరం, ఇన్ఫెక్షన్‌తో ఇబ్బంది పడుతుండగా, బుధవారం స్వల్పంగా ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆస్పత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని వైద్య బృందం వెల్లడించింది. మంత్రి ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా వైద్యులు స్పష్టం చేశారు.

Post a Comment