-->

నాటు తుపాకీతో యువకుడు హల్‌చల్‌.. పాత నేరస్తుడు ఇమ్రాన్ అరెస్ట్‌

 

నాటు తుపాకీతో యువకుడు హల్‌చల్‌.. పాత నేరస్తుడు ఇమ్రాన్ అరెస్ట్‌

నాటు తుపాకీతో యువకుడు హల్‌చల్‌.. పాత నేరస్తుడు ఇమ్రాన్ అరెస్ట్‌

హైదరాబాద్: నగరంలోని సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాటు తుపాకీతో భయాందోళనలు సృష్టిస్తున్న పాత నేరస్తుడు ఇమ్రాన్ అలియాస్ ఇబ్బును పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి ఒక కంట్రీమేడ్ (నాటు) తుపాకీ, ఒక లైవ్ రౌండ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు మల్కాజిగిరి ఎస్‌వోటీ (SOT) బృందం, సరూర్‌నగర్ పోలీసులు సంయుక్తంగా భగత్‌సింగ్‌నగర్ బస్తీలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఇమ్రాన్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అతడి వద్ద నాటు తుపాకీ, ఒక లైవ్ రౌండ్ లభించాయి.

విచారణలో నిందితుడు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం జంపాక గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఇమ్రాన్ చెడు అలవాట్లకు బానిసై నేరాల బాట పట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

రాజేంద్రనగర్‌లోని ఓ స్క్రాప్ దుకాణంలో పనిచేస్తున్న సమయంలో బిహార్‌కు చెందిన షకీర్ అనే వ్యక్తి నుంచి రూ.40 వేలకే కంట్రీమేడ్ తుపాకీతో పాటు ఒక లైవ్ రౌండ్ కొనుగోలు చేసినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఇమ్రాన్‌పై ఇప్పటికే నగరంలోని వివిధ పోలీస్‌స్టేషన్లలో 17 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సరూర్‌నగర్ ఇన్‌స్పెక్టర్ వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793