-->

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు

గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు

హైదరాబాద్: తెలంగాణ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాడ బోనాల ఉత్సవాలు గురువారం గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని లంగర్ హౌజ్ చౌరస్తాలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.

ఉత్సవ వేదికకు చేరుకున్న మంత్రి కొండా సురేఖకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికారు. హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆమె అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల నడుమ తొలి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

సాంస్కృతిక కళాకారుల అభ్యర్థన మేరకు మంత్రి కొండా సురేఖ ఈరగోల చేతిలో ధరించి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం సాంస్కృతిక శాఖ రూపొందించిన ఆషాడ బోనాల ఉత్సవాల బుక్‌లెట్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆవిష్కరించారు. అలాగే ప్రభుత్వం తరఫున గోల్కొండ జగదాంబిక ఆలయ కమిటీకి రూ.11 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ ఆషాడ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరం డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, జానపద కళాకారుల ప్రదర్శనలతో పండుగ శోభను సంతరించుకుందని మంత్రి తెలిపారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో ఎల్‌నినో ప్రభావం తగ్గి, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, తెలంగాణ అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్న మంత్రి, బోనాల ఉత్సవాల సందర్భంగా పెద్ద దేవాలయాలతో పాటు చిన్న దేవాలయాలకు కూడా ప్రభుత్వం నిధులు కేటాయిస్తోందని తెలిపారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారిని దర్శించుకునేలా అన్ని శాఖల సమన్వయంతో సకల ఏర్పాట్లు చేసినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793