మంత్రి వివేక్ వెంకటస్వామికి బొమ్మెర శ్రీనివాస్ వినతి
మంత్రి వివేక్ వెంకటస్వామికి బొమ్మెర శ్రీనివాస్ వినతి
ఏజెన్సీ ఎస్సీలకు స్థానిక సంస్థల రిజర్వేషన్, సాగు భూముల హక్కులు కల్పించాలని విజ్ఞప్తి
కొత్తగూడెం, జూలై 12: తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మెర శ్రీనివాస్ ఆదివారం కలిసి పలు కీలక అంశాలపై వినతిపత్రం సమర్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎస్సీ వర్గాలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ వంటి స్థానాల్లో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. అలాగే ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా సాగు చేస్తున్న ఎస్సీ రైతుల భూములకు గతంలో ఉన్న హక్కులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తొలగించిన సాగు భూముల హక్కులను తిరిగి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత మంత్రులు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏజెన్సీ ప్రాంత ఎస్సీ వర్గాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని బొమ్మెర శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి సమస్యను పరిశీలించి పరిష్కార మార్గాలపై ఆలోచిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడ రమేష్, అంబేద్కర్ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దెల శివకుమార్, చిన్నన్న, గుండా రమేష్, అశోక్, ఎనగంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Post a Comment