-->

కాచిగూడ కమేళాలో అధికారుల ఆకస్మిక తనిఖీలు.. 60 కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం

 

కాచిగూడ కమేళాలో అధికారుల ఆకస్మిక తనిఖీలు.. 60 కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం

కాచిగూడ కమేళాలో అధికారుల ఆకస్మిక తనిఖీలు.. 60 కిలోల కుళ్లిన మాంసం స్వాధీనం

హైదరాబాద్‌లోని కాచిగూడ కమేళాలో హెచ్-ఫాస్ట్ అధికారులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచిన 60 కిలోల కుళ్లిపోయిన మాంసాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కుళ్లిన మాంసాన్ని అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

సమాచారం అందుకున్న సికింద్రాబాద్ టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ మహేష్, కానిస్టేబుల్ వినయ్‌తో కలిసి కాచిగూడ కమేళాకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాంసం నిల్వ ఉంచిన ప్రదేశాలను పరిశీలించగా.. వినియోగానికి పనికిరాని, పూర్తిగా కుళ్లిపోయిన మాంసం పెద్ద మొత్తంలో బయటపడింది.

అధికారులు వెంటనే 60 కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు దానిని వినియోగించకుండా ఉండేందుకు మాంసంపై ఫినాయిల్ చల్లి నిర్వీర్యం చేశారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా కుళ్లిన మాంసాన్ని నిల్వ ఉంచిన యజమాని అఖిల్‌పై కేసు నమోదు చేసి చలాన్ విధించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ నాణ్యత లేని, కుళ్లిపోయిన ఆహార పదార్థాలను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆహార పదార్థాల నిల్వ, విక్రయాల్లో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793