-->

ఓలా, ఉబర్ ఆటోలను నిలిపివేయాలని కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్ల నిరసన

ఓలా, ఉబర్ ఆటోలను నిలిపివేయాలని కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్ల నిరసన

 

ఓలా, ఉబర్ ఆటోలను నిలిపివేయాలని కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్ల నిరసన

కరీంనగర్, ఆగస్టు 4: ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఓలా, ఉబర్ ఆటో సేవలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా ఆటో డ్రైవర్లు మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, మహాలక్ష్మి పథకం అమలుతో ఇప్పటికే ఆటో డ్రైవర్లు సగం మేర ఉపాధిని కోల్పోయారని తెలిపారు. ఇప్పుడు ఓలా, ఉబర్ ఆటోలు, బైక్ రైడింగ్ సేవలకు అనుమతి ఇస్తే మిగిలిన ఉపాధి కూడా పూర్తిగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం వెంటనే ఓలా, ఉబర్ ఆటోలు, బైక్ రైడింగ్ సేవలను నిలిపివేసి ఆటో కార్మికుల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.

నిరసన అనంతరం ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలని కోరుతూ భిక్షాటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆటో కార్మికులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793