హెచ్‌ఎంఎస్ తెలంగాణ రక్షణ సేన పోరాట ఫలితమే డిప్‌సైడ్ బ్లాక్: కోడిపల్లి శ్రీలత
హెచ్‌ఎంఎస్ తెలంగాణ రక్షణ సేన పోరాట ఫలితమే డిప్‌సైడ్ బ్లాక్: కోడిపల్లి శ్రీలత
మణుగూరు, ఆగస్టు 3: మణుగూరు పీకేఓసీ డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణి సంస్థ కైవసం కావడం హెచ్‌ఎంఎస్ తెలంగాణ రక్షణ సేన పోరాట ఫలితమేనని హెచ్‌ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ కోడిపల్లి శ్రీలత పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హెచ్‌ఎంఎస్ టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, హెచ్‌ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ సింగరేణి బాయిబాట కార్యక్రమంలో మణుగూరు మనుగడను కాపాడుతామని ఇచ్చిన హామీ నేడు ఫలించిందన్నారు.
డిప్‌సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కడం కార్మికుల విజయమని, ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న ఈ నిర్ణయం పట్ల హెచ్‌ఎంఎస్ ఆనందం వ్యక్తం చేస్తోందన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు.
ఇంతటితో ఆగకుండా మిగిలిన ఏరియాల్లో సింగరేణికి రావాల్సిన బ్లాక్‌లను కూడా సంస్థకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. అలాగే మణుగూరు డిప్‌సైడ్ బ్లాక్‌లో పనులను సింగరేణి శాశ్వత కార్మికులతోనే నిర్వహించాలని హెచ్‌ఎంఎస్ డిమాండ్ చేసింది.
ఈ ప్రకటనపై హెచ్‌ఎంఎస్ మణుగూరు బ్రాంచ్ సెక్రటరీ దరిసా రమేష్ కూడా స్పందిస్తూ కార్మికుల ప్రయోజనాల పరిరక్షణ కోసం హెచ్‌ఎంఎస్ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.

Post a Comment