-->

పార్సిల్ వ్యాన్‌లో రూ.1.08 కోట్ల నగదు స్వాధీనం.. ఇద్దరుని అరెస్ట్ చేసిన పోలీసులు

పార్సిల్ వ్యాన్‌లో రూ.1.08 కోట్ల నగదు స్వాధీనం.. ఇద్దరుని అరెస్ట్ చేసిన పోలీసులు


పార్సిల్ వ్యాన్‌లో రూ.1.08 కోట్ల నగదు స్వాధీనం.. ఇద్దరుని అరెస్ట్ చేసిన పోలీసులు 

తమిళనాడులోని చెంగుండ్రమ్ సమీపంలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి చెన్నై వెళ్తున్న ఓ ప్రైవేట్ కొరియర్ పార్సిల్ వ్యాన్‌లో రూ.1.08 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

పోలీసుల వివరాల ప్రకారం.. చెంగుండ్రమ్ సమీపంలోని పడియనల్లూరు–మోండియం మన్నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద ఆదివారం చెన్నై వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఒక ప్రైవేట్ కొరియర్ పార్సిల్ వ్యాన్‌ను ఆపి తనిఖీ చేయగా, పార్సిళ్ల మధ్య అనుమానాస్పదంగా దాచి ఉంచిన మూడు హ్యాండ్‌బ్యాగులు కనిపించాయి.

పోలీసులు బ్యాగులను తెరిచి పరిశీలించగా, వాటిలో మొత్తం రూ.1.08 కోట్ల నగదు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే నగదును స్వాధీనం చేసుకుని వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ (36)ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే విజయవాడకు చెందిన పవన్ (28), వ్యాన్ డ్రైవర్ రాంబాబు (40)లను కూడా విచారించారు.

ప్రాథమిక విచారణలో ప్రవీణ్, పవన్‌లు చెన్నైలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఈ నగదును తీసుకెళ్తున్నట్లు పోలీసులకు తెలిపారు. అయితే నగదు రవాణాకు సంబంధించి ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు లేదా ఆధారాలు వారి వద్ద లేకపోవడంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

దీంతో రూ.1.08 కోట్ల నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ పూర్తయిన అనంతరం నగదుతో పాటు నిందితులను చెన్నైలోని ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793