-->

తెలంగాణలో రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌గా వరంగల్ అభివృద్ధి.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం

 

తెలంగాణలో రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌గా వరంగల్ అభివృద్ధి.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం

తెలంగాణలో రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌గా వరంగల్ అభివృద్ధి.. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు వేగవంతం

హైదరాబాద్: తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మెడికల్ హబ్‌గా వరంగల్‌ను అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు చేపడుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సమావేశంలో వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పురోగతి, ఎంజీఎం ఆసుపత్రి, సీకేఎం ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రి, ప్రభుత్వ ఆయుర్వేద టీచింగ్ హాస్పిటల్, నర్సంపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, ప్రభుత్వ ప్రాంతీయ కంటి ఆసుపత్రి, కాకతీయ మెడికల్ కాలేజీతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇతర ప్రభుత్వ వైద్య సంస్థల అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, అత్యాధునిక సాంకేతికత వినియోగం, సిబ్బంది భర్తీ, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవల అందుబాటు వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ప్రత్యేకంగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యవసర విభాగం, డయాలసిస్ యూనిట్, క్యాథ్‌ల్యాబ్, ఆక్సిజన్ సదుపాయాలు, ఆధునిక వైద్య పరికరాల ఏర్పాటు, అవసరమైన వైద్య మరియు సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రిని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఎంజీఎం ఆసుపత్రిపై పడుతున్న రోగుల ఒత్తిడిని గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు.

వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణం ఇప్పటికే దాదాపు పూర్తయిందని పేర్కొంటూ, మిగిలిన ఆధునిక వైద్య పరికరాల అమరిక, ల్యాండ్‌స్కేపింగ్, అంతర్గత రహదారుల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ఆసుపత్రిని వీలైనంత త్వరగా ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూకు ఆదేశాలు జారీ చేశారు.

వరంగల్‌ను అత్యాధునిక వైద్య సేవలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యమని సమావేశంలో వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793