సిరిసిల్ల చేనేతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. అగ్గిపెట్టెలో ఇమిడే చీర నేసిన హరిప్రసాద్‌కు ప్రశంసల వెల్లువ
సిరిసిల్ల చేనేతకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు.. అగ్గిపెట్టెలో ఇమిడే చీర నేసిన హరిప్రసాద్‌కు ప్రశంసల వెల్లువ
సిరిసిల్ల: తెలంగాణ చేనేత కళాకారుల ప్రతిభ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. సిరిసిల్లకు చెందిన ప్రముఖ చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ తన అసాధారణ నైపుణ్యంతో అరుదైన ఘనత సాధించారు. కేవలం 2 గంటల 50 నిమిషాల వ్యవధిలో మగ్గంపై చీరను నేసి, అనంతరం ఆ చీరను అగ్గిపెట్టెలో ఇమిడేంత చిన్నదిగా మడిచేలా రూపొందించడం ద్వారా ఆయన చేనేత కళా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.
ఈ అద్భుతమైన సృష్టి వెనుక హరిప్రసాద్ దాదాపు ఏడాది పాటు నిరంతర శ్రమ, పరిశోధన, సాధన చేసినట్లు తెలుస్తోంది. సంప్రదాయ చేనేత కళకు ఆధునిక సృజనాత్మకతను జోడిస్తూ ఆయన సాధించిన ఈ ఘనతకు చేనేత వర్గాలు, కళాభిమానులు, ప్రజల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
హరిప్రసాద్ కళా నైపుణ్యాన్ని కొనియాడుతూ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అసాధ్యంగా భావించిన లక్ష్యాన్ని పట్టుదల, కృషితో సుసాధ్యం చేయడం నిజంగా స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సిరిసిల్ల చేనేతకు ఆయన తీసుకొచ్చిన గుర్తింపు ప్రతి చేనేత కార్మికుడికి గర్వకారణమని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్తులో కూడా హరిప్రసాద్ మరిన్ని వినూత్న విజయాలు సాధించి, సిరిసిల్ల చేనేతకు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆయనలాంటి కళాకారులు సంప్రదాయ చేనేత రంగానికి కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు యువతకు స్ఫూర్తిగా నిలుస్తారని పేర్కొన్నారు

Post a Comment