పీలేరులో దారుణం.. భర్తను హత్య చేసి మూటకట్టి హైవేపై పడేసిన భార్య
పీలేరులో దారుణం.. భర్తను హత్య చేసి మూటకట్టి హైవేపై పడేసిన భార్య
పీలేరు: భర్తను హత్య చేసి, మృతదేహాన్ని మూటకట్టి హైవేపై పడేసిన ఘటన అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలో కలకలం రేపింది. రామానాయక్ తండా సమీపంలోని హైవేపై శనివారం సుబ్బయ్య అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది.
స్థానికుల సమాచారం ప్రకారం.. తొలుత సుబ్బయ్యను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెంది ఉంటాడని పోలీసులు భావించారు. అయితే ఘటనాస్థలంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
పోలీసుల దర్యాప్తులో సుబ్బయ్యను ఇంట్లోనే హత్య చేసి, అనంతరం మృతదేహాన్ని మూటకట్టి బైక్‌పై తీసుకెళ్లి హైవేపై పడేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో భార్య, కుమారుడి పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
మృతదేహాన్ని హైవేపై పడేసిన దృశ్యాలకు సంబంధించిన సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే హత్యకు కారణాలు ఏమిటి? కుటుంబ కలహాలే కారణమా? అనే విషయాలు పోలీసుల పూర్తి దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Post a Comment