బతుకమ్మ సంబురాల పోస్టర్‌తో పాటు బతుకమ్మ పాటల సీడీని ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత
బతుకమ్మ సంబురాల పోస్టర్‌తో పాటు బతుకమ్మ పాటల సీడీని ఆవిష్కరించిన కల్వకుంట్ల కవిత
వచ్చే ఏడాది 2.5 లక్షల మందితో బతుకమ్మ.. గిన్నిస్ రికార్డే లక్ష్యం
హైదరాబాద్: వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించేలా కార్యక్రమాన్ని చేపడతామని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.
ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బతుకమ్మ సంబురాల పోస్టర్‌తో పాటు బతుకమ్మ పాటల సీడీని కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించినప్పటికీ అవి సఫలం కాలేదన్నారు.
ఈ ఏడాది తెలంగాణలోని 33 జిల్లాలతో పాటు విదేశాల్లోనూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది బతుకమ్మ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటేలా 2.5 లక్షల మందితో భారీ వేడుక నిర్వహించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. ఇందుకోసం గ్రామస్థాయిలో బతుకమ్మ, కోలాటం కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో బతుకమ్మ వైభవాన్ని చాటేందుకు కృషి చేస్తామని కవిత తెలిపారు. ఈ ఏడాది జాగృతి ఆధ్వర్యంలో జరిగే బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరణ
చప్పట్ల పాటలు, సంప్రదాయ బతుకమ్మ పాటలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో సీడీని రూపొందించినట్లు కవిత తెలిపారు. ఇప్పటికే రూపొందించిన పాటలను యూట్యూబ్‌లోనూ అందుబాటులో ఉంచినట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి తెలిపారు.
వచ్చే ఏడాది 2.5 లక్షల మందితో బతుకమ్మ నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించడమే లక్ష్యమని ఆమె చెప్పారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
సాంస్కృతిక వికాసం, మహిళా సాధికారతపై దృష్టి
తెలంగాణ ఉద్యమకాలం నుంచి సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ జాగృతిని మరింత బలోపేతం చేయాలని కవిత నిర్ణయించినట్లు సంస్థ తెలిపింది. సాంస్కృతిక వికాసంతో పాటు మహిళా సాధికారత, సామాజిక అసమానతల నిర్మూలన కోసం సంస్థను మరింత విస్తృతంగా పనిచేసేలా తీర్చిదిద్దనున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీతో పాటు పలు జిల్లాలు, వివిధ దేశాలకు నూతన కమిటీలను ప్రకటించారు. మిగిలిన జిల్లాల కమిటీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ
- అధ్యక్షురాలు: మారిపెల్లి మాధవి
- ఉపాధ్యక్షులు: జాడి శ్రీనివాస్, పర్శ చంద్రశేఖర్
- ప్రధాన కార్యదర్శి: గుంటి సుందర్
- కార్యదర్శులు: కన్నం శారద, దొండి స్వర్ణలత, మస్తాన్
- మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు: మానుకోట సునీత
జిల్లాల అధ్యక్షులు
జగిత్యాల – పట్టూరి తిరుపతి | రంగారెడ్డి – ఎండీ మొయినుద్దీన్ | వరంగల్ – పొలుదాసరి రమేశ్ | హన్మకొండ – నెట్టి రజిత | మహబూబ్‌నగర్ – ఏర్పుల నర్సింలు | సూర్యాపేట – లక్కపాక ప్రవీణ్ | భూపాలపల్లి – గుమ్మడి రవీందర్ | నిజామాబాద్ – అవంతి కుమార్ | పెద్దపల్లి – మేడారపు రాజ్యలక్ష్మీ | కరీంనగర్ – గుండు మంజుల | కామారెడ్డి – రెడ్డిపేట సతీశ్ కుమార్.
మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వేణుగోపాల్ యాదవ్‌ను నియమించారు.
విదేశాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షుల నియామకం
- న్యూజిలాండ్: ముద్దం అరుణ జ్యోతి
- ఖతార్: ప్రవీణ లక్ష్మీ
- ఖతార్ ప్రధాన కార్యదర్శి: ఆదర్శ రెడ్డి పోతుల
- యూఎస్‌ఏ: రాజ్ గోవిల్కర్
- ఓమన్: గుండు రాజేందర్ నేత
- కెనడా: కుందె రాఘవేంద్ర యాదవ్
- ఐర్లాండ్: సంతోష్ పల్లె
- స్విట్జర్లాండ్: కిశోర్ తాటికొండ
- ఇటలీ: సౌమ్య పిన్నంరెడ్డి
- నార్వే: కిరణ్ తేజ సూధటి
- నార్వే ప్రధాన కార్యదర్శి: నిఖిత బిల్లకంటి
- జింబాబ్వే: శ్రావణ్ కుమార్ గౌడ్
- కెన్యా: గంట్ల స్వప్నా రెడ్డి

Post a Comment