కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబును నరికి చంపిన దుండగులు
నిజామాబాద్‌లో నడిరోడ్డుపై దారుణ హత్య
కొబ్బరికాయలు కోసే కత్తితో హరిబాబును నరికి చంపిన దుండగులు
నిజామాబాద్ నగరంలోని రాజారాజేంద్ర చౌరస్తా వద్ద నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. హరిబాబు అనే వ్యక్తిపై ముగ్గురు వ్యక్తులు కలిసి దాడి చేసి, కొబ్బరికాయలు కోసే కత్తితో నరికి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులు పరారైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు పాత కక్షలే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరోవైపు, ఇటీవల వెలుగులోకి వచ్చిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో హరిబాబు నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులే హత్యకు పాల్పడ్డారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
హరిబాబు మృతదేహాన్ని పోలీసులు నిజామాబాద్ జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment