-->

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

 

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలు.. కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కొత్తగూడెం: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీపీసీసీ పిలుపు మేరకు సుజాతనగర్ సెంటర్‌లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్రా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పాల్గొని ఎమ్మెల్సీ తాతా మధు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా నాగా సీతారాములు మాట్లాడుతూ.. దళిత వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిలో ఉన్నారని, అలాంటి గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తిపై అసభ్యకరమైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు. రాజకీయంగా భేదాభిప్రాయాలు ఉండవచ్చని, ప్రభుత్వ విధానాలను విమర్శించవచ్చని, కానీ వ్యక్తిగత గౌరవాన్ని, స్పీకర్ పదవి ఔన్నత్యాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదని అన్నారు.

అదేవిధంగా అసెంబ్లీలో టీ-షర్టులు విప్పి బనియన్‌తో రావడం ఏం రాజకీయ సంస్కారమని ప్రశ్నించారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులే ఇలాంటి ప్రవర్తనకు పాల్పడటం బాధాకరమని, ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నాగా సీతారాములు డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతరావు, జిల్లా జనరల్ సెక్రటరీ పైడా రాజేంద్రప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ రాంబాబు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కిన్నెర వెంకన్న, సర్పంచులు వజ్జా రామారావు, గుగులోతు జానికిరామ్, శ్రీకాంత్, మాజీ సర్పంచులు భద్రూ నాయక్, రాందాస్ నాయక్, ఏఎంసీ డైరెక్టర్ అమ్రూ నాయక్, కోటేష్ నాయక్, శ్రీనివాసరావు, నరసింహరావు, ఎట్టి భాస్కర్, భుక్య మోహన్, గాజుల సీతారామయ్య, మండే శ్రీను, లింగం లక్ష్మయ్య, చల్లా నాగేశ్వరరావు, ఓర్సు ఉపేందర్, సిద్ధల నరేందర్, నునావత్ సంతోష్, చిట్లూరి సుధీర్‌తో పాటు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, అభిమానులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.