బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులకు నిరసనగా కొత్తగూడెంలో ర్యాలీ
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులకు నిరసనగా కొత్తగూడెంలో ర్యాలీ
కొత్తగూడెం: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల అరెస్టును నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పార్టీ పిలుపు మేరకు కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్‌లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు తొలుత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల అరెస్టులను ఖండిస్తూ సంబంధిత అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం పోస్టాఫీస్ సెంటర్ నుంచి ప్రధాన రహదారుల మీదుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసనను తెలియజేస్తున్న నాయకులను అరెస్టు చేయడం సరికాదని విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీల అరెస్టులకు దారితీసిన పరిస్థితులపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ర్యాలీ సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోస్టాఫీస్ సెంటర్ పరిసరాల్లో కొంతసేపు రాజకీయ సందడి నెలకొంది.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, టీబీజీకేఎస్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాసరావు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య, సెంట్రల్ కమిటీ సభ్యులు ప్రసాద్, కంచర్ల శ్రీనివాసరావు, సెక్రటరీ సూరజ్, అసిస్టెంట్ సెక్రటరీ అమరేందర్, శంకర్, సింహ సుబ్బారావు, సత్యనారాయణ, రాబిన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment