-->

చెల్లిని కాపాడేందుకు వాగులోకి దూకిన అన్న.. చివరికి ఇద్దరూ మృతి

 

చెల్లిని కాపాడేందుకు వాగులోకి దూకిన అన్న.. చివరికి ఇద్దరూ మృతి

చెల్లిని కాపాడేందుకు వాగులోకి దూకిన అన్న.. చివరికి ఇద్దరూ మృతి

నిజామాబాద్ జిల్లా: జన్నేపల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వాగులో పడి అన్నాచెల్లెలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

చెల్లెలు లయ వాగులో పడిపోవడంతో, ఆమెను కాపాడేందుకు అన్న అల్లే గణేశ్ వెంటనే వాగులోకి దూకాడు. అయితే ప్రమాదవశాత్తు ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. ఈ ఘటనలో అన్నాచెల్లెలు గణేశ్, లయ మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది.

ఈ ఘటనపై నవీపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నాచెల్లెలు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, జన్నేపల్లి గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది.

Blogger ఆధారితం.