-->

ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు గ్రీన్‌ సిగ్నల్‌

 

ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు గ్రీన్‌ సిగ్నల్‌.. దానం నాగేందర్‌పై అనర్హత అధికారిక ప్రకటన

ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు గ్రీన్‌ సిగ్నల్‌.. దానం నాగేందర్‌పై అనర్హత అధికారిక ప్రకటన

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖైరతాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ అనర్హతకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు తెలంగాణ శాసనసభ కార్యదర్శి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు.

అసెంబ్లీ కార్యదర్శి విడుదల చేసిన గెజిట్‌ ప్రకారం.. దానం నాగేందర్‌పై 2024 ఏప్రిల్‌ 23 నుంచి అనర్హత అమల్లోకి వచ్చినట్లు పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 191(2), పదో షెడ్యూల్‌ (పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం ఆయనపై అనర్హత వేటు పడినట్లు తెలిపారు.

ఈ నెల 18న తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా శాసనసభ కార్యదర్శి ఈ ప్రకటన జారీ చేసినట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. అనర్హత అధికారికంగా అమల్లోకి రావడంతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా ప్రకటించబడింది.

దీంతో ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. అయితే ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంటుంది. ఎన్నికల తేదీలు, నామినేషన్ల ప్రక్రియ తదితర వివరాలు ఈసీ ప్రకటన తర్వాత స్పష్టమవుతాయి.

ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు, ఎన్నికల షెడ్యూల్‌పై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. 


Blogger ఆధారితం.