-->

ఇంద్లాతండాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

 

ఇంద్లాతండాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

ఇంద్లాతండాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్

ఇంద్లా తండా: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు ఆధ్వర్యంలో ఇల్లందు సబ్‌ డివిజన్ పోలీసులు ఇంద్లాతండాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, ఇతర అంశాలను పరిశీలించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

అనంతరం గ్రామస్తులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, రోడ్డు భద్రతా నిబంధనలపై ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీఎస్పీ వెంకన్న బాబు సూచించారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు.

Blogger ఆధారితం.