-->

గోల్కొండలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్

 

గోల్కొండలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్

 గోల్కొండలో వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్

బాధితురాలికి విముక్తి.. నాలుగు మొబైల్ ఫోన్లు, ఇతర సామగ్రి స్వాధీనం

హైదరాబాద్‌: గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై కమిషనర్ టాస్క్‌ఫోర్స్ (గోల్కొండ జోన్) బృందం, స్థానిక గోల్కొండ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించింది. ఈ దాడిలో వ్యభిచార గృహం నిర్వాహకురాలు, సహ నిర్వాహకురాలు, ఒక విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడ నిర్బంధంలో ఉన్న ఓ బాధితురాలిని సురక్షితంగా రక్షించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోల్కొండలోని మహమ్మద్ నగర్‌కు చెందిన ఫర్హా బేగం (32), ఆరాంఘర్‌కు చెందిన ఫర్హీన్ (25) కలిసి మహిళలకు అధిక మొత్తంలో డబ్బులు ఇస్తామని ఆశ చూపి నగరానికి తీసుకువచ్చేవారు. అనంతరం గోల్కొండ ప్రాంతంలో వారికి వసతి కల్పించి, విటులను ఏర్పాటు చేస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో మహిళల ద్వారా అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు.

వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన నిర్వాహకురాలు ఫర్హా బేగం, సహ నిర్వాహకురాలు ఫర్హీన్‌తో పాటు కొండాపూర్‌కు చెందిన వెల్డర్, విటుడు ఫయాజ్ ఆలం (32)ను అదుపులోకి తీసుకున్నారు.

దాడి సమయంలో అక్కడ ఉన్న ఓ బాధితురాలిని పోలీసులు రక్షించారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు మొబైల్ ఫోన్లు, కండోమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత క్రిమినల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

గోల్కొండ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎం. మహేష్ పర్యవేక్షణలో ఎస్‌ఐ వి. శ్రీనివాస్, స్థానిక పోలీసులు, మహిళా పోలీసు సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.


Blogger ఆధారితం.