-->

ప్రగతినగర్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

భార్యాభర్తల అరెస్ట్.. ఓ మహిళ, విటుడు అదుపులోకి


ప్రగతినగర్‌లో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

భార్యాభర్తల అరెస్ట్.. ఓ మహిళ, విటుడు అదుపులోకి

హైదరాబాద్, నవంబర్ 5: ప్రగతినగర్‌లో అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌ను కేంద్రంగా చేసుకుని కొంతకాలంగా సాగుతున్న వ్యభిచార కార్యకలాపాలను పోలీసులు గుట్టురట్టు చేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జూడియో షాపింగ్ మాల్ వెనుక ఉన్న ప్రకాష్ ప్రైడ్ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్ నంబర్ 207లో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో ఏహెచ్‌టీయూ, బాచుపల్లి పోలీసులు బుధవారం రాత్రి సంయుక్తంగా దాడి నిర్వహించారు.

దాడి సందర్భంగా విజయవాడకు చెందిన తూము కిరణ్, అతని భార్య దుర్గాభవానితో పాటు ఓ మహిళ, ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కిరణ్, దుర్గాభవానిపై పోలీసులు పీటా చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

అపార్ట్‌మెంట్‌లోని నివాస ఫ్లాట్‌లో ఈ తరహా కార్యకలాపాలు వెలుగులోకి రావడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి కార్యకలాపాలపై పోలీసులు మరింత నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Blogger ఆధారితం.