ప్రేమ వ్యవహారంలో మనస్తాపం.. నర్సింగ్ విద్యార్థిని మృతి
ప్రేమ వ్యవహారంలో మనస్తాపం.. నర్సింగ్ విద్యార్థిని మృతి
బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువు సింగారం గ్రామానికి చెందిన చెరప కవిత (20) అనే నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది.
గ్రామానికి చెందిన ఓ యువకుడితో కవితకు పరిచయం ఏర్పడినట్లు, ఆ పరిచయం ప్రేమగా మారినట్లు సమాచారం. ఈ క్రమంలో వివాహం చేసుకోవాలని ఆమె కోరగా, యువకుడు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కవిత ఇంట్లో పురుగుల మందు సేవించింది.
వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కుమార్తె మరణంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
కవిత మృతికి కారణమైన యువకుడిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు బూర్గంపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Post a Comment