నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. వ్యక్తి అక్కడికక్కడే మృతి!

 

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. వ్యక్తి అక్కడికక్కడే మృతి!

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్కూటీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. వ్యక్తి అక్కడికక్కడే మృతి!

**నల్గొండ:** నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కారు స్కూటీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నల్గొండ మండలం చందనపల్లి శివారులో శనివారం ఉదయం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి స్కూటీపై నకిరేకల్ వైపు వెళ్తుండగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు స్కూటీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ పక్కనే ఉన్న పొలాల్లో బోల్తా పడింది. స్కూటీ సైతం గాలిలోకి ఎగిరి కిందపడింది.

ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న వ్యక్తి తీవ్ర గాయాలతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Blogger ఆధారితం.