పంజాగుట్టలో స్పా ముసుగులో వ్యభిచార గృహం.. నిర్వాహకురాలు అరెస్ట్
పంజాగుట్టలో స్పా ముసుగులో వ్యభిచార గృహం.. నిర్వాహకురాలు అరెస్ట్
హైదరాబాద్: బ్యూటీ సెలూన్, స్పా ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న కేంద్రంపై పంజాగుట్ట పోలీసులు దాడి చేశారు. ఈ ఘటనలో ప్రధాన నిర్వాహకురాలు సన్నెబోయిన నాగమణిని అరెస్టు చేయగా, ఒక బాధిత మహిళకు పోలీసులు విముక్తి కల్పించారు. మరో ఇద్దరు విటులను అదుపులోకి తీసుకుని నోటీసులు జారీ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. నాగమణి పంజాగుట్టలోని నాగార్జున సర్కిల్ సమీపంలో ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకుని స్పా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మసాజ్ సేవల పేరుతో మహిళలను నెలవారీ జీతం ఇస్తామని చెప్పి పనిలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం వారిని బెదిరించి బలవంతంగా వ్యభిచార కార్యకలాపాల్లోకి దింపినట్లు వెల్లడించారు.
విశ్వసనీయ సమాచారం అందడంతో మంగళవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ ఈ. జహంగీర్ యాదవ్ ఆధ్వర్యంలో పోలీసులు స్పాపై దాడి చేశారు. ఈ సందర్భంగా ప్రధాన నిర్వాహకురాలు నాగమణిని అరెస్టు చేశారు. బాధిత మహిళను రక్షించి రెస్క్యూ హోమ్‌కు తరలించారు.
అరెస్టు చేసిన నాగమణిని నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. స్పా కేంద్రానికి వచ్చిన ఇద్దరు విటులకు నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు చేపట్టారు.

Post a Comment