షార్ట్ సర్క్యూట్‌తో టాటా ఏస్ దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
షార్ట్ సర్క్యూట్‌తో టాటా ఏస్ దగ్ధం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం!
కొమురం భీం ఆసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని 363వ జాతీయ రహదారిపై వాహన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బూరుగుడా బీఎడ్ కళాశాల సమీపంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా టాటా ఏస్ ప్యాసింజర్ వాహనం పూర్తిగా దగ్ధమైంది.
TS 1 EB 6667 నంబర్ గల ఈ వాహనం గెడేకర్ రవీందర్‌కు చెందినదిగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎనిమిది మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. వాహనాన్ని రహదారిపై నిలిపివేసి, అందులో ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులను సురక్షితంగా కిందకు దింపాడు.
అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అయితే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకునేలోపే మంటలు వాహనం మొత్తం వ్యాపించడంతో పూర్తిగా కాలిపోయింది. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎనిమిది మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినప్పటికీ, వాహనం పూర్తిగా దగ్ధం కావడంతో యజమానికి భారీ ఆస్తినష్టం వాటిల్లింది.

Post a Comment