-->

అజిత్‌సింగ్‌నగర్ మదర్సాలో ఫుడ్ ఫైజన్ విద్యార్థిని మృతి

అజిత్‌సింగ్‌నగర్ మదర్సాలో ఫుడ్ ఫైజన్ విద్యార్థిని మృతి

అజిత్‌సింగ్‌నగర్ మదర్సాలో ఫుడ్ ఫైజన్ విద్యార్థిని మృతి

 విజయవాడ అజిత్‌సింగ్‌నగర్ మదర్సాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం రాత్రి భోజనం తిన్న విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో విద్యార్థులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుడివాడకు చెందిన విద్యార్థిని కరిష్మా కన్నుమూశారు. మిగిలిన ఏడుగురు విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

 దీంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తల్లిదండ్రులతో కలిసి మదర్సా స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. మదర్సా స్కూలు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. 

ఈ ఘటనతో వీఎంసీ, హెల్త్ అధికారులు హుటాహుటిన మదర్సాకు వెళ్లారు. తాగునీరు, వంటశాలను పరిశీలించారు. పుడ్ పాయిజన్‌కు గల కారణాలపై ఆరా తీశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793